Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
తెలంగాణ ఉద్యమకారుడు ప్రముఖ అంబేద్కర్వాదిగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడమే కాకుండా ఓయూలో అతి చిన్న వయసులోనే డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ లా పదోన్నతి పొందిన ప్రొ. గాలి. వినోద్ కుమార్ అందరికీ ఆదర్శనీయుడని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. సోమవారం రాజ్ భవన్లో వినోద్ కుమార్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్కూల్ అఫ్ లా కాశ్మీర్ విశ్వవిద్యాలయంలో ఈనెల 18న ఆయన చేయబోతున్న ప్రసంగం గురించి చర్చించారు. ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ వచ్చిన తర్వాత విశ్వవిద్యాలయంలో చేపట్టిన నూతన విద్యా ప్రమాణాలు, హర్యానా, విశ్వవిద్యాలయాల ఛాన్స్లర్గా తన హయాంలో చేపట్టిన విశ్వవిద్యాలయాల ప్రగతికి గురించి చర్చించినట్లు వినోద్ కుమార్ తెలిపారు.