Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
25 ఏండ్లలోపు యువతను కూడా ఎక్కువ ప్రభావితం చేసే మహమ్మారిలా పెరుగుతున్న ఈ నిశ్శబ్ద వైద్య పరిస్థితి గురించి అవగాహన కల్పించడానికి ప్రతి ఏడాదీ ప్రపంచ హైపర్టెన్షన్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ హైపర్ టెన్షన్ రోజు మెడికవర్ హాస్పిటల్స్ వారు మూడు రోజుల పాటు ఒక ప్రధాన అధ్యయనం చేశారు. నగరంలోని వివిధ ప్రదేశాల్లో మూడు రోజుల వ్యవధిలో తీసుకున్న 300 నమూనాల్లో దాదాపు 30శాతం హైపర్టెన్సివ్ అనీ, 20శాతం చెకప్ సమయంలో గుర్తించబడ్డాయి. 50శాతం ఇప్పటికీ తెలియదు. ఇది జీవనశైలి లేదా జన్యుపరమైన కారణం వల్ల కావచ్చు అని వైద్యులు తెలిపారు. హార్ట్ ఎటాక్స్, స్ట్రోక్స్, డెమెంటియా, కిడ్నీ వ్యాధులు వంటి ఎన్నో అనారోగ్య సమస్యలకు మూల కారణంగా హైపర్టెన్షన్ నిలుస్తోంది. చాలామందిలో ఈ లక్షణాలు బయటపడవు. చాలా మందికి వీటి పట్ల అవగాహన కూడా లేదు. ఈ కారణంతో అత్యవసర పరిస్థితులకు, నిర్వహించలేని స్థితికి తీసుకువెళ్లి రోగులతో పాటు వారి కుటుంబ సభ్యులను భౌతికంగా, ఆర్ధికంగా ఒత్తిడికి గురి చేస్తుంటాయి. దేశంలో హెపర్ టెన్షన్ మంచు ఫలకం ప్రధానంగా అవగాహన ఉన్న, అవగాహనలేమి ప్రజల నడుమ అసమానతలను సూచిస్తుంది. ఇక్కడ కఠినమైన అంశం ఏమిటంటే దాదాపు 60-70శాతం మంది అధిక రక్తపోటు కలిగిన వ్యక్తుల్లో తమకు ఆ సమస్య ఉందని కూడా తెలియదు. కేవలం 30శాతం మందికి మాత్రమే తమ వైద్య స్థితిపట్ల అవగా హన ఉంది. నగరాల్లో దాదాపు 33శాతం మంది అధిక రక్తపోటుతో ఇబ్బంది పడుతుండగా వారిలోనూ కేవలం 42శాతం మందికి మాత్రమే తమ స్థితి పట్ల అవగాహన ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 25శాతం మందికి అధిక రక్తపోటు ఉండగా, వారిలో 25శాతం మందికి మాత్రమే తమ స్థితి గురించి తెలుసు. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ డైరెక్టర్-క్లీనికల్ సర్వీసెస్, డాక్టర్ శరత్ రెడ్డి మాట్లాడుతూ ''కార్డియాలజీ డిపార్ట్మెంట్ను సందర్శిస్తోన్న 70-80శాతం మంది రోగులు అధిక రక్తపోటుతో బాధప డుతున్నారు. వీరిలో చాలా మందికి తమకు రక్తపోటు ఉందనే సంగతి తెలియదు. బీపీని 140/90కు తక్కువగా ఉంచుకోవడాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రతి రోజూ మానిటర్ చేసుకోవాలి. ప్రజలకు ఈ దిశగా అవగాహన కల్పించాలి'' అని తెలిపారు. రక్తపోటు నియంత్రణలో లేకపోతే హార్ట్ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్ వంటి సమస్యలతో పాటు మూత్ర పిండాల వ్యాధులు, విచక్షణ కోల్పోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.