Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
ప్రజలకు మౌళిక సదుపాయాలు కల్పిస్తామని నాగారం మున్సిపల్ చైర్మెన్ కౌకుంట్ల చంద్రారెడ్డి అన్నారు. సోమవారం నాగారం మున్సిపాలిటీలోని 5వ వార్డు అన్నపూర్ణ ఎనక్లేవ్లో రూ.10 లక్షల రూపాయలతో చేపట్టిన బీటీ రోడ్డు పనులకు చైర్మన్ శంకుస్థాపన చేసి మాట్లాడారు. కాలనీల పరంగా విస్తరించి ఉన్న నాగారం మున్సిపాలిటీలో దశల వారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మెన్ బండారి మల్లేష్ యాదవ్, కౌన్సిలర్ అన్నంరాజు, లావణ్య, శ్రీనివాస్, కాలనీ వాసులు పాల్గొన్నారు.