Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
పెంచిన వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని సీఐటీయూ, ఐద్వా, పట్నం సంఘాలు డిమాండ్ చేశాయి. సోమవారం ధరల పెంపుదలను నిరసిస్తూ కూకట్పల్లి, రిక్షా పుల్లర్ కాలనీలో నిరసన కార్యక్రమం చేపట్టాయి. ఈ సందర్భంగా నాయకులు ఎం.శంకర్, యాదగిరి, తాళ్లపల్లి రూతు మాట్లాడుతూ కరోనా మహమ్మారి, ఉపాధిలేమితో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారనీ, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవాల్సింది పోయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెంచి ప్రజలపై భారాలు మోపుతున్నాయన్నారు. కరోనా కష్టకాలంలో కార్మికులకు, పేదలకు కుటుంబానికి రూ.7,500 ఇవ్వా లని పలు మార్లు ప్రభుత్వాలను కోరినా పట్టించుకోలేద న్నారు. కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు అక్కడి ప్రజలకు ఉచితంగా నిత్యావసర సరుకులు అందించడంతో పాటు, ప్రతి కుటుంబానికీ రూ.10 వేలు ఇచ్చి ఆదుకు న్నాయని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రజల గురించి ఆలోచించాలనీ, పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పద్మాదేవి, కలమ్మ, వెంకటమ్మ, చంద్రమ్మ, ఎల్లమ్మ, ఇంద్రమ్మ, నరసమ్మ, మాధవి, తదితరులు పాల్గొన్నారు.