Authorization
Sat March 29, 2025 11:06:46 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
రైతులు ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి పండించిన దాన్యం కొనుగోలు జరుగుతున్న ఇబ్బందులను సరి చేయాలని డిమాండ్ చేస్తూ ఎర్రమంజిల్లోని పౌరసరఫరాల శాఖ ప్రధాన కార్యాలయం వద్ద కిసాన్ కాంగ్రెస్ వద్ద నిరసన చేశారు. ప్రభుత్వం, అధికారులు చేస్తున్న చర్యలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధనిక రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడటం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.