Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని సీఐటీయూ అంబర్పేట నియోజకవర్గ ఉపాధ్యక్షులు మహేందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న వద్ధాప్య పింఛన్ దరఖాస్తులను వెంటనే పరిశీలించి అర్హులకు పెన్షన్ మంజూరు చేయాలని మంగళవారం సీఐటీయూ, ఐద్వా, డీవైఎఫ్ఐ, కేవీపీఎస్ ఆధ్వర్యంలో అంబర్పేట ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. మహేందర్ హాజరై మాట్లాడుతూ ఐదేండ్ల నుంచి పెండింగ్లో ఉన్న వృద్ధాప్య, వితంతు పింఛన్లు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీఎల్ మోహన్, వరలక్ష్మి, సుబ్బారావు, శ్రీనివాస్, కవిత, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.