Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
హరితహారం కార్యక్రమంలో భాగంగా 33వ డివిజన్ పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొలను శ్రీనివాస్‌రెడ్డి, కార్పొరేటర్ ఏనుగుల శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వంశీకృష్ణతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. రాజీవ్ గృహకల్ప సమీపంలోని పలు సమస్యను స్థానికులు కమిషనర్‌కు దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో కార్పొరేటర్ రాఘవేంద్రరావు, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ అధ్యక్షులు వాకలపూడి రంగరాయ ప్రసాద్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.