Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రాష్ట్ర స్పౌజ్ ఫోరం డిమాండ్
- విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతి
నవతెలంగాణ-అడిక్‌మెట్
13 జిల్లాల స్పౌజ్ బదిలీల సమస్యను వెంటనే పరిష్కరించండి అని తెలంగాణ రాష్ట్ర స్పౌజ్ ఫోరం నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని తన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 317 బదిలీల్లో భాగంగా ఉపాధ్యాయ దంపతులను వేర్వేరు జిల్లాలకు కేటాయించారు అని తెలిపారు. 19 జిల్లాల్లో స్పౌజ్ బదిలీలు నిర్వహించి, 13 జిల్లాలను బ్లాక్ లిస్ట్‌లో చేర్చారని వాపోయారు. ఐదు నెలలుగా భర్త ఒక జిల్లా, భార్య మరో జిల్లాలో బోధనా విధులకు హాజరవుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. బ్లాక్ చేసిన ఈ 13 జిల్లాల్లో ఇబ్బందులు పడుతున్న వారిలో 90% శాతం మంది ఉపాధ్యాయునిలే ఉన్నారని చెప్పారు. ఇటు కుటుంబాన్ని చూసుకోలేక, అటు విధులకు న్యాయం చేయలేక మానసికంగా తీవ్ర సంఘర్షణ అనుభవిస్తున్నాం అని అన్నారు. కుటుంబాల్లో నెలకొన్న ఆందోళన నేపథ్యంలో స్పౌజ్ బదిలీలు వెంటనే జరిపించే విధంగా ప్రభుత్వంతో చర్చించాలని కోరారు. ఈ విషయం ముఖ్యమంత్రి పరిధిలో ఉందని ఆయన దష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు.