Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్మెట్
ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలను రంగారెడ్డి జిల్లా విద్యాధికారి సుశిందర్ రావు, చైల్డ్ లైఫ్ ఫోరమ్ సభ్యులు అంజన్రావు, మండల విద్యా అధికారి హీర్యానాయక్లతో కలిసి శుక్రవారం సీజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ కల్వంచలోని సెయింట్ జోసెఫ్ పాఠశాల ప్రభుత్వ అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారు. సెయింట్ జోసెఫ్ పాఠశాలకు విద్యాశాఖ అధికారులు ఫిబ్రవరి19, ఏప్రిల్ 25, మే 16న ఇలా మూడు పర్యాయాలుగా నోటీసులు జారీ చేసినప్పటికీ పాఠశాల యాజమాన్యం పట్టించుకోకపోవడంతో విద్యా శాఖ అధికారులు సెయింట్ జోసెఫ్ పాఠశాలను సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సూర్య, విద్యా శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.