Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తాం అని ఏఐటీయూసీ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు ఎండీ. ఉమర్ ఖాన్, జేఏసీ కన్వీనర్ బి.వెంకటేశం అన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా రాష్ట్ర లారీ, ఆటో, క్యాబ్ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ గురువారం తలపెట్టిన బంద్ సికింద్రాబాద్ నియోజకవర్గంలో విజయవంతమైంది. కరోనా సంక్షోభ సమయంలో కార్మికులను ఆదుకోవాల్సి ఉండగా.. కేంద్ర ప్రభుత్వం జీవో 714 తీసుకొచ్చి అన్యాయం చేస్తోందన్నారు. ఫిట్నెస్ రెన్యూవల్ పేరుతో రోజుకు రూ.50 పెనాల్టీ వేయడం తగదని ఆటోలు, క్యాబ్‌లు, లారీల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ కె.లతీఫ్, బి.కష్ణమూర్తి పాల్గొన్నారు.