Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
రేవంత్ రెడ్డి ఒక ఉన్నత హోదాలో ఉంటూ ఓయూ విద్యార్థులు బీర్, బిర్యానీకి అమ్ముడుపోతారని, తార్నాక బార్లో తాగుతారు అనే వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదం అని ఓయూ విద్యార్థి నేత కొనపురం.శశిపాల్ అన్నారు. గురువారం ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జైల్ కేసులు, ఎన్నో నిర్బంధాలు చవిచూసిన విద్యార్థుల గురించి మాట్లాడే హక్కు రేవంత్ రెడ్డికి లేదన్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో, బ్లాక్ మెయిల్ చేసే వ్యక్తి ఓయూ విద్యార్థుల పట్ల నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో గోవిందా రెడ్డి, విశాల్, రామకష్ణ, మిథున్ ప్రసాద్, విజరు, ఇస్మాయిల్ విద్యార్థులు పాల్గొన్నారు.