Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద సంఘటన జరిగింది. ఇక్కడి మల్కారం చెరువు వద్దకు వెళ్లిన సందర్భంలో ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు చెరువులోకి జారిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటా హుటిన వెళ్లి చెరువులో పడ్డవారిని బయటకు తీశారు. ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరో బాబును పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. పిల్లల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. పిల్లలకు అక్కడికి ఎందుకు వెళ్లారు? ఏం జరిగింది తదితర పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గతంలో కూడా ఈ ప్రాంతంలో ఇటువంటి ప్రమాదాలు జరిగాయి. గతంలో విద్యార్థులు ఈతకోసం వెళ్లి చెరువులో మునిగి చనిపోయిన సంఘలనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తల్లిదంద్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.