Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
రాష్ట్ర ఆవిర్భావాన్ని పురస్కరించుకుని ఉత్తరాఖండ్ రాష్ట్రం జోషిమాట్ ప్రాంతంలోని పంగార్చి లా పర్వతంపై (14700 అడుగులు) ఐదుగురు సభ్యులతో కూడిన టీం జూన్ 2న జాతీయ జెండాతో పాటు తెలంగాణ రాష్ట్ర పటాన్ని ఆవిష్కరించేందుకు బయలుదేరింది. ఈ సాహసయాత్రను అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ వ్యవస్థాపకులు కె రంగారావు ఆధ్వర్యంలో బొగ్గులకుంటలోని ఎండోమెంట్ కార్యాలయం ఆవరణలో ప్రభుత్వ సలహాదారులు కె.వి.రమణాచారి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిమాలయా పర్వతాల అధిరోహించేందుకు వెళ్తున్న జట్టును ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కన్నీబాయి, కరుణ సాగర్, చందు, ఆనంద్ బాబు లను ఆయన అభినందించారు.