Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యాదయ్య, మండల కార్యదర్శి ఎన్. సబిత
నవతెలంగాణ-ఘట్కేసర్
కాలనీవాసులు ఐక్యంగా, రాజకీయలకతీతంగా ఇండ్ల వెడల్పు కోసం కృషి చేయడం అభినందనీయమని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చింతల యాదయ్య మండల కార్యదర్శి ఎన్. సబిత అన్నారు. పోచారం మున్సిపాల్టీ పరిధిలోని ఆన్నోజిగూడ రాజీవ్ గృహకల్ప ఇండ్ల వెడల్పు కార్యక్రమానికి శుక్రవారం స్థానిక కాలనీవాసులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారుÛ మాట్లాడుతూ అనేక సంవత్సరాల నుంచి ఇరుకు గదుల్లో ప్రజలు నివసించలేకపోతున్నారని చెప్పారు. ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించడానికి నిరాకరించడంతో విధిలేని పరిస్థితుల్లో ఎవరి అపార్టుమెంట్ల దగ్గర వారు ఉన్న స్థలాన్ని బట్టి, సొంత ఖర్చులతో నిర్మాణాలు చేపట్టారన్నారు. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ అధికారులకు మెమోరండం రూపంలో ముందే తెలియజేసినట్టు తెలిపారు. ఇండ్ల నిర్మాణానికి సహకరించాలని కాలనీవాసులు కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు కె. అలివేల, గ్రామ శాఖ కార్యదర్శి, బి.సునీత, సీహెచ్ అరుణ, అనసూర్య, మాజీ వార్డు మెంబర్లు యు. వెంకటేష్, ఐలయ్య, పయ్యావుల లక్ష్మి, సంతోష్, జ్యోతి, భాస్కర్, చంద్రకళ, పుష్ప, సతీష్, శివ, అజరు, వెంకటేష్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.