Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాటర్‌బోర్డు ఎండీ దానకిశోర్
- జలమండలి అధికారులతో సమీక్షా సమావేశం
నవతెలంగాణ-సిటీబ్యూరో
తాగునీటి సరఫరాలో ఆటంకాలు లేకుండా చూడాలనీ, నగరంతో పాటు ఓఆర్ఆర్ పరిధిలోని ప్రాంతాలకు సరిపడా తాగునీరు అందుబాటులో ఉందని వాటర్‌బోర్డు ఎండీ దానకిశీర్ అన్నారు. ప్రణాళికా బద్ధంగా సరఫరా చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. శుక్రవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఓ అండ్ ఎం డివిజన్ 1, 2ఏ, 2బీ, 3కి సంబంధించిన అధికారులతో నీటి సరఫరాపైన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడా నీటి సరఫరాకు ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. సిటీలోని అన్ని ప్రాంతాల్లోనూ లో ప్రెషర్ సమస్యలు లేకుండా చూడాలన్నారు. నీటిని వృథా కానీయకుండా కచ్చితమైన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభించనున్న నేపథ్యంలో జలమండలి చేపట్టాల్సిన ప్రణాళికలను సెక్షన్ల వారీగా సిద్ధం చేసుకోవాలని చెప్పారు. ఈ నెల 25వ తేదీ నుంచి భద్రతా వారోత్సవాలు చేపట్టనున్నట్టు తెలిపారు. క్షేత్రస్థాయిలో పని చేస్తున్నప్పుడు కార్మికులు, సిబ్బంది తీసుకోవాల్సిన రక్షణ చర్యల గురించి, రక్షణ పరికరాల వినియోగం, తదితర అంశాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపారు. సమీక్షా సమావేశంలో జలమండలి రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, ఆపరేషన్స్ డైరెక్టర్ అజ్మీరా కృష్ణ, సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు, మేనేజర్లు, ట్రాన్స్మిషన్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.