Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ నాయకులు సత్యం శ్రీరంగం
నవతెలంగాణ-బాలానగర్
కూకట్పల్లి సర్కిల్ బాలానగర్ డివిజన్ పరిధిలోని నాలాల్లో పూడికతీత పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు సత్యం శ్రీ రంగం డిమాండ్ చేశారు. శుక్రవారం బాలానగర్ డివిజన్లో గల బీబీఆర్ హాస్పిటల్ నుండి బొజై కల్యాణ మండపం వరకు నాలాను కాంగ్రెస్ నేతలతో కలసి పరిశీలించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నాలాపై నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. నిర్మాణాల పేరుతో నాలాల్లో మట్టితో నింపుతూ ఆక్రమణకు గురవుతున్నాయ న్నారు. గతంలో వర్షాకాలంలో వరదనీటి ప్రవాహానికి పలు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయనీ, రానున్న వర్షాకాలంలో తిరిగి పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి నాలాలు ఆక్రమణకు గురికాకుండా, బ్రిడ్జి నిర్మాణ పనుల ను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పుష్పా రెడ్డి, ఏ బ్లాక్ అధ్యక్షులు పి.నాగిరెడ్డి, టీపీసీసీ మాజీ కార్యదర్శి నవీన్ గౌడ్, బాలానగర్ డివిజన్ అడ్హాక్ కమిటీ ప్రెసిడెంట్ మట్టే ప్రసన్న కుమార్, మధు గౌడ్, మధుమోహన్, మహేం దర్, రిషి యాదవ్, హేమంత్, పుష్పరాజ్, మహమ్మద్ సమీ, వినోద్, తదితరులు పాల్గొన్నారు.