Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ చాంప్స్ చాప్టర్ దేశంలో వ్యాపారాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని బీఎన్ఐ సికింద్రాబాద్ రీజన్ అధ్యక్షుడు కె.సెంథిల్ కుమార్ అన్నారు. బీఎన్ఐ చాంప్స్ చాప్టర్ సికింద్రబాద్ రీజన్ ఏడో వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఆదిత్యా పార్క్ హౌటల్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జంట నగరాల్లోని వ్యాపార రంగంలోని ప్రముఖులు, బీఎన్ఐ చాంప్స్ చాప్టర్ సికింద్రబాద్ రీజన్ ఎక్జిక్యాటీవ్ డైరెక్టర్ ఉదరు శెట్టి, అధ్యక్షుడు సెంథిల్ కుమార్, ఉపా ధ్యక్షుడు రాఘవేందర్, కార్యదర్శి కోశాధికారి ఎల్.గణేష్, సపోర్ట్ అంబాసిడర్ అనంత్ కుల్కరిణి, కమిటీ సభ్యులు ఎం.ప్రణీత్, కె.రంగనాథ్ గుప్తా, మానషి, సంతోష్ కుమార్, కో-ఆర్డినేటర్స్ శిరీష్ కుమార్ వర్మ, మేడిపల్లి శ్రీనివాస్, కష్బ నవీన్ కుమార్, శివ కాంత్, శ్రీహరి, లక్ష్మి బెల్దె, శ్రీకాంత్ కొత్తూరి, నారాయణ్ దాస్ మైండెడ్ తో పాటు తదితర వ్యాపార వేత్తలు, వివిధ వ్యాపార సంస్థలు అధిపతులు రెండు వందల మంది వరకు పాల్గొన్నారు. సెంథిల్ కుమార్ అధ్యక్షతన వ్యాపార కార్యకలాపాలు, బిజినెస్‌కు సంబంధించిన విషయాలను, లావా దేవిలను వెల్లడించారు. ప్రముఖులు మాట్లాడుతూ వివిధ వస్తువులు ఉత్పత్తి చేసి విక్రయించుకుని వస్తున్న లాభ నస్టాలు వివరించారు. మీడియా, రియల్ ఎస్టేట్ రంగంలో కూడా వ్యాపారులు అందిస్తున్న సేవలు ఈ సందర్భంగా కొనియా డారు. అనంతరం బీఎన్ఐ చాంప్స్ చాప్టర్ సభ్యులందరికీ మెమోంటోలు, విసిటర్స్కి జ్ఞాపికలు అందజేశారు.