Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. రంగారెడ్డినగర్ డివిజన్ పరిధిలోని పంచశీల కాలనీలో భూగర్భ డ్రయినేజీ, సీసీ రోడ్లు ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతూ పంచశీలకాలనీ వాసులు శుక్రవారం ఎమ్మెల్యేను ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారు లతో ఫోన్లో మాట్లాడి ఆయా పనులను అవసరమైన వ్యయ ప్రణాళికలు రూపొందించి త్వరలోనే ఏర్పాటు చేసే లా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు రహీం, రమణారెడ్డి, నరేందర్, ప్రభాకర్, అశోక్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
సీసీ రోడ్డు పనులు పూర్తి చేయండి
రంగారెడ్డినగర్ డివిజన్ పరిధిలోని విజరునగర్ కాలనీలో డ్రయినేజీ పూర్తయిందనీ, మిగిలి ఉన్న సీసీ రోడ్లు పూర్తి చేసేలా కృషి చేయాలని కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ను ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సీసీ రోడ్లకు అవసరమైన వ్యయ ప్రణాళికలు రూరొందించి త్వరలోనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి సుధాకర్, కాలనీ అధ్యక్షులు బాలరాజు, నాయకులు కార్తీక్గౌడ్, తదితరులు పాల్గొన్నారు.