Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అల్మాస్గూడలో డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన
- మేయర్ పారిజాత నర్సిహ్మారెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్లోని ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసి సమస్యల పరిష్కారం కోసం ఎంతో కషి చేస్తుందని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహ్మారెడ్డి అన్నారు. ఆదివారం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని 4వ డివిజన్, 24వ డివిజన్లకు సంబంధించిన డ్రైనేజీ నిర్మాణ పనులకు మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, స్థానిక కార్పొరేటర్లు సంరెడ్డి స్వప్న వెంకట్రెడ్డి, ఏనుగు రాంరెడ్డి, ముత్యాల లలిత కష్ణ, మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామిడి రాంరెడ్డిలతో కలసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎంతో కషి చేస్తుందని తెలిపారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అదేశంతో ఇప్పటికే కోట్లాది రూపా యల నిధులతో అనేక అభివద్ధి కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. ప్రజల సౌకర్యం కోసం అల్మాస్గూడ శివాజీచౌక్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు, పోచమ్మ చెరువు నుండి విశాఖనగర్ ఫేస్ 1 వరకు డ్రైనేజి నిర్మాణ పనులను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈఈ అశోక్ రెడ్డి, కాలనీవాసులు పాల్గొన్నారు.