Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను విస్మరించింది
- ఆశల పల్లకిగా టీఆర్ఎస్ ప్రభుత్వం
- రచ్చబండ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్‌మెట్
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఆశల పల్లకిగా మారిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారన్నారు. కాంగ్రెస్ రచ్చబండలో భాగంగా రెండవ రోజు అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, కుత్బుల్లాపూర్ గ్రామంలో ఎంపీటీసీ భాస్కర్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత నిస్తూ పేద, మధ్య తరగతి ప్రజల అభివద్ధి కోసం కషి చేస్తుందని, రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ఇటీవల వరంగల్‌లో జరిగిన రైతు డిక్లరేషన్ అనుసరించి మండలంలో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. శనివారం బండ రావిరాల, బాచారం, గౌరెల్లి, ఆదివారం కుత్బుల్లాపూర్ గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు మేలు కన్న కీడే ఎక్కువ చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బుర్ర రేఖ మహేందర్, జెడ్పీటీసీ బింగిదాస్ గౌడ్, వైస్ ఎంపీపీ కొలను శ్రీధర్ రెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, బాచారం సర్పంచ్ పారంద సంతోష కిషన్, ఎంపీటీసీి భాస్కర్ గౌడ్, ఉప సర్పంచ్ మోర ప్రభాకర్ ముదిరాజ్, డైరెక్టర్ కొత్తపల్లి జైపాల్ రెడ్డి, చామ కష్ణా రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు ఎండీ గౌస్ బాషా, నాయకులు శ్రీనివాస్, అంతటి ఉషయ్య గౌడ్, చిలుక మధుసూదన్ రెడ్డి, తాటిపల్లి రమేష్ గౌడ్, మేడిపల్లి వేంకటేష్, పండుగుల రాజు, పొడిశెట్టి శ్రీనివాస్‌గౌడ్, యూత్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.