Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బేగంబజార్‌లో పరువు హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి
- ఐద్వా సౌత్ జిల్లా కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు శశికళ, లక్ష్మమ్మ
నవతెలంగాణ-ధూల్‌పేట్
రాష్ట్రంలో కులదురహంకార హత్యలను జరగకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఐద్వా సౌత్జిల్లా కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు శశికళ, లక్ష్మమ్మ డిమాండ్ చేశారు. బేగంబజార్‌లో హత్యకు గురైన నీరజ్ కుటుంబీకులను ఐద్వా నాయకులు ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారు కుల దురహంకార హత్యలను ఖండించారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుచేసి నీరజ్‌ను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. మార్వాడి కులానికి చెందిన నీరజ్ పాన్వార్ను గౌలి (యాదవ్) కులానికి చెందిన సంజనను ప్రేమించి గత ఏడాది కిందట పెళ్లి చేసుకున్నారన్నారు. దీన్ని జీర్ణించుకోలేని సంజన సహోదరులు కక్షపూరితంగా దురహంకార హత్యకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండించారు. కుల దురహంకార హత్యల పూర్తి నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.