Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
కల్లుగీత కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి పాలకమండలిని నియమించాలని కల్లుగీత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ చైర్మెన్ బాలగోని బాలరాజ్ గౌడ్, కన్వీనర్ ఐలి వెంకన్న గౌడ్, వర్కింగ్ చైర్మెన్ ఎలికట్టె విజరుకుమార్ గౌడ్, బాల వెంకటేష్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం చిక్కడపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని వైన్షాప్లను 50% గౌడ్లకు, ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 20 శాతం, ఆరెకటికలకు 5 శాతం, లోది కులానికి 5% కేటాయించాలని కోరారు. గౌడ్లకు కేటాయించే వైన్షాప్లను కల్లుగీత సొసైటీలకు, టీఎఫ్టీలకు ఇవ్వాలన్నారు. ప్రమాదవశాత్తు తాటి చెట్లపై నుంచి పడి మరణించిన, శాశ్వత వికలాంగులైన వారికి పది లక్షల ఎక్స్గ్రేషియా, తాత్కాలిక అంగవైకల్యం పొందిన వారికి 5 లక్షలు ఇవ్వాలన్నారు. 50 ఏండ్లు నిండిన గీతా వత్తి కార్మికులకు ప్రతినెలా ఐదు వేల పెన్షన్ కల్పించాలని కోరారు. కల్లుగీత వత్తి రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. గౌడ జనాభా ధామాషా ప్రకారం అన్ని పదవుల్లో అవకాశం కల్పించాలని కోరినట్లు తెలిపారు. ఈ విషయాలపై ఎమ్మెల్సీ కవితా సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి కేసీఆర్ దష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించే విధంగా కషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.