Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
దీక్ష, కృషి పట్టుదల లక్షణాలుగా అక్కినేని నాగేశ్వరరావు ఎన్నో సవాళ్లను అధిగమించి సినీ రంగంలో ఎవరెస్టు శిఖరంలా నిలిచారని అలనాటి నటి, నిర్మాత కష్ణవేణి అన్నారు. జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంలో ఆకతి సాంస్కతిక సంస్థ నిర్వహణలో అక్కినేని సినీ రంగ ప్రవేశం జరిగి 78 ఏండ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా అక్కినేని సమాలోచన కార్యక్రమం నిర్వహించారు. కష్ణవేణి అలనాటి సంఘటనలు వివరిస్తూ తొలి రోజుల్లో జానపద కథానాయకుడిగా నటించిన అక్కినేని తదుపరి సాంఘీక చిత్రాల కథానాయకుడిగా పేరు గడించారని వివరించారు. కష్ణ వేణి కుమార్తె నిర్మాత అను రాధాదేవి మాట్లాడుతూ తాము నిర్మించిన చక్రధరి, శ్రీవారి ముచ్చట్లు, అనుబంధం వంటి హిట్ చిత్రాల్లో అక్కినేని నటించారని గుర్తు చేసుకొన్నారు. ఆకతి సుధాకర్ స్వాగతం పలికిన కార్యక్రమంలో మదర్ థెరిస్సా ఫౌండేషన్ చైర్మెన్ శంకర్, కడప రామకష్ణ, ఏడుకొండలు పాల్గొన్నారు.