Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-బడంగ్పేట్
బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 26వ డివిజన్లోని శ్రీహిల్స్ కాలనీలో గల ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచెలేకుండా ప్రమాదకరంగా ఉంది. పిల్లలు ఎవరైనా ఆడుకుంటూ వెళ్లినా, పశువులు అటువైపు వెళ్లినా ఘోర ప్రమాదం సంభవించేలా ఉంది. రోడ్డుపై ఉన్న ఈ ట్రాన్స్ఫార్మర్ను విద్యుత్ అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని రాష్ట్ర గిరిజన సంఘం ఉపాధ్యక్షుడు బహుగుణ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాలనీలోగల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు కంచ ెలేకపోగా అది తక్కువ ఎత్తులో ఉన్నందున మరింత ప్రమాదం పొంచి ఉందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచె ఏర్పాటు చేయడంతోపాటు ఎత్తు పెంచాలని కోరారు.