Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కుత్బుల్లాపూర్
సీపీఐ మండల కార్యదర్శి ఉమామహేష్, జీహెచ్ ఎంసీ పరిధిలోని వివిధ సర్కిళ్లల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, అందులో సూపర్వైజర్లు కార్మికులను తీవ్రంగా ఇబ్బందికి గురిచేస్తున్నారని, అలాంటి వారిని ఉద్యోగాల నుండి తీసివేయాలని సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం కుత్బుల్లాపూర్, గాజుల రామారం సర్కిల్ డిప్యూటీ కమిషనర్లకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ సర్కిల్లో సోమవారం వెలుగుచూసిన ఘటన దారుణమని, అవి వాస్తవాలే కావున దర్యాప్తు పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు పునరావతం కావని సూచించారు. సూపర్వైజర్లు కేవలం తిట్టడమే కాకుండా వారికి నచ్చని వారిని హాజరు పట్టికలో వచ్చినా రానట్టు వెయ్యడం, సెలవులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం, జీవితంలో 500 రూపాయలు తీసుకోవడం లాంటివి సహజంగా మారిపోయిందని, ఇలాంటి వాటి వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. అధికారులు సూపర్వై జర్లు చెప్పిన మాటలు మాత్రమే వినకుండా కింది స్థాయి సిబ్బందిని కూడా అడిగి తెలుసుకుంటే వారి ఆవేదన అర్థమవతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు వెంకటేష్, రాములు, శ్రీనివాస్, సాగర్, ప్రభాకర్ ,అశోక్ పాల్గొన్నారు.