Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబేద్కర్ ఆశయ సాధనకు యువత ముందుకు సాగాలి
- బీఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్ మెట్
అణగారిన ప్రజల బంగారు భవితకు బహుజన రాజ్యం రావాలని బీఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సోమవారం రాత్రి అబ్దుల్లాపూర్‌మెట్ మండలం అనాజ్‌పూర్ గ్రామంలో బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణలో ఆయన మాట్లా డారు. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్లు బహుజను లను ఓటు బ్యాంక్‌గా వాడుకుంటు న్నాయనీ, వారి అభివృద్ధికి ఏ మాత్రమూ కృషి చేయడం లేదన్నారు. చిన్న, చిన్న పథకాల పేరుతో ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నారే తప్పా రాజ్యాధికారం దిశగా అవకాశాలు కల్పించలేకపోతున్నారన్నారు. బహుజ నులంతా సంఘటితమై బహుజన రాజ్యాధికారం కోసం పోరాడా ల్సిన అవసరం ఆసన్నమైందని పిలుపునిచారు. బీఎస్పీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత విద్య, వైద్యం అంది స్తామని తెలి పారు. పేద విద్యార్థులు డాక్టర్, ఇంజినీర్లు, ఐఏఎస్, ఐపీఎస్ కావాలంటే నాణ్యమైన విద్య అవసరం అనీ, బీఎస్పీతోనే సాధ్యమవుతుందని తెలిపారు. అంబే ద్కర్ విగ్రహాలనే కాకుండా అంబేద్కర్ ఆశయ సాధన కోసం యువత జ్ఞాన సమాజం వైపు నడవాలని సూచించారు. ప్రగతి భవన్‌కు ఏనుగుపై వెల్దామనీ, అందుకు మన మంతా సంఘటితం కావాల్సిన అవసరం ఉందని తెలి పారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు కంది కంటి విజరు కుమార్, భైరి నరేష్, గుండె శ్రీనివాస్, యంజాల ప్రహ్లాద్, ఏర్పుల ప్రవీణ, బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు.