Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
కోవిడ్ వైరస్ సోకి మరణించిన వైద్యుల కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ కోశాధికారి డాక్టర్ గట్టు శ్రీనివాసులు కోరారు. బుధవారం కోఠిలోని తన నిలయంలో ఆయన మాట్లాడుతూ కోవిడ్ విపత్కర సమయంలో వైద్యసేవలందిస్తూ తెలంగాణవ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయిన 68 మంది వైద్యుల కుటుంబాలకు నేటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదన్నారు. కరోనాతో మరణించిన ప్రభుత్వ వైద్య సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించినా నేటికీ ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌తో పాటు ఫ్యామిలీ సెక్యూరిటీ స్కీమ్‌లో సభ్యత్వం కలిగి కరోనాతో చనిపోయిన వైద్యుల కుటుంబాలకు రూ.20లక్షలు, ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ సభ్యత్వం కలిగి కరోనా మరణించిన వైద్యుల కుటుంబాలకు రూ.9లక్షల చొప్పున ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆర్థిక సహాయం అందిం చడం జరిగిందన్నారు. మానవతా దక్పథంతో చేయూతనందించి ఆదుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.