Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాక్టర్ రామ్ చందర్
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
బస్తీ దవాఖానాలో బీపీ, థైరాయిడ్, షుగర్, లివర్, కిడ్నీ తదితర వాటికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందిస్తున్నామని చంద్ర కిరణ్ బస్తి దవాఖాన డాక్టర్ రామ్ చందర్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ రోగులకు అవసరమయ్యే అన్ని రక్త పరీక్షలను ఉచితంగా నిర్వహించి మందులను ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. ప్రజలు, గర్భిణీలు, చిన్నపిల్లలు, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రతి బుధవారం చిన్న పిల్లలకు టీకాల పంపిణీ నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు చేతులను సబ్బుతో శుభ్రపరచుకోవాలి అన్నారు. పౌష్టిక ఆహారం, పప్పు ధాన్యాలు. పండ్లు, బలమైన ఆహారం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్టాఫ్‌నర్స్ అనురాధ, అశోక్ అశోక్., ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.