Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
హబ్సిగూడ డివిజన్ కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్ ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ ఆరుణకుమారి, ప్రాజెక్ట్ ఆఫీసర్ రమాదేవి లతో మున్సిపల్ ఆఫీస్లో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డివిజన్లోని వీధి వ్యాపారుల సమస్యలపై చర్చించారు. వీధి వ్యాపారులు ప్రతి ఒక్కరూ మున్సిపల్ అధికారుల ఇచ్చే ఐడీ తీసుకోవాలని కార్పొరేటర్ తెలిపారు. తద్వారా ప్రధాన మంత్రి స్వనిధి నుంచి వచ్చే పదివేల రూపాయల రుణం పొందే ఆవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.