Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు
- డాక్టర్ ఎన్. గౌతంరావు
నవతెలంగాణ-అంబర్‌పేట
అక్రమ కేసులతో బీజేపీ నాయకులనును టీఆర్ఎస్ నాయకులు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆపార్టీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డా. ఎన్. గౌతమ్ రావు అన్నారు. టీఆర్ఎస్ పట్ల రోజురోజుకు ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా పెరుగుతుండటంతో పాటు బీజేపీ ఆదరణకు జీర్ణించుకోలేక అక్రమ కేసులు బనాయిస్తున్నారని దుయ్యబట్టారు. తాజాగా నల్లకుంట డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి మహేష్‌పై కేసు బనాయించడమే నిదర్శనమని అన్నారు. ఈ వైఖరిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని, ఇకపైన టీఆర్ఎస్ తన విధానాలను మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మహేష్‌పై పెట్టిన కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.