Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
కార్మికులు ధైర్యవంతులు అనే జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెంకటేష్ అన్నారు. బుధవారం జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న జీహెచ్ఎంసీ మున్సిపల్ కార్మికులకు మద్దతుగా తన కార్యాలయం నుంచి మహనీయుల విగ్రహం వరకు పాదయాత్ర చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుధ్య కార్మికుల ధైర్యం గొప్పదన్నారు. కరోనా సమయంలో వారి సేవలు చిరస్థాయిగా నిలుస్తాయన్నారు. ప్రభుత్వం కార్మికులకు జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదని, తంబ్ మిషన్ సరిగ్గా పనిచేయకపోవడంతో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే త్వరలో పెద్దఎత్తున జీహెచ్ఎంసీ కార్యాలయం ముట్టడించి సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు.