Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న వివిధ ప్రొఫెసర్స్, బోధనేతర ఉద్యోగుల క్వార్టర్స్‌ను ఓయూ బిల్డింగ్ డివిజన్ అధ్వర్యంలో గత కొన్ని రోజులుగా కూల్చివేస్తున్నారు. ఓయూ ఎస్టేట్ సెల్ ఆధ్వర్యంలో మరమ్మతులు చేపట్టలేని, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా, శిథిలావస్థలో ఉన్న సుమారు 100పైగా క్వార్టర్స్ కూల్చి వేస్తున్నారు. ఇంకొక వైపు గత కొన్ని సంవత్సరాలుగా వీటికి మరమ్మతుల పేరుతో లక్షల్లో నిధులు బిల్డింగ్ డివిజన్లో కొంత మంది అధికారులు దుర్వినియోగం చేశారని సమాచారం...
నూతన పరిపాలనా భవన్ నిర్మాణం?
ఓయూలో నూతన పరిపాలన భవన్‌ను హబ్సిగుడా, తార్నాక ప్రధాన రహదారి పక్కన ఉన్న ఓయూ ల్యాండ్‌లో సీసీఎంబీ గేట్ ఎదురుగా నిర్మాణం చేయాలని ప్రపోజల్‌ను ఈ నెల 23న జరిగిన పాలక మండలి సమావేశం ప్రతిపాదనను పెట్టారు. ఒక వైపు ఓయూలో పైలాన్ నిర్మాణం, ఇంకొక వైపు పారిపాలన భవన్ నిర్మాణం కోసం మరి నిధులు ఎక్కడ నుంచి సేకరిస్తారో వేచి చూడాల్సిందే.