Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను వ్యతిరేకిస్తూ కోనసీమ ప్రాంతాన్ని కుల పిచ్చి సీమగా మార్చారని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ డాక్టర్ పిడమర్తి రవి విమర్శించారు. బుధవారం హైదరాబాద్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ భూమిపూజలో పాల్గొన్న ఆయన మీడియాతో ముచ్చటించారు. ఎన్టీఆర్ జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా పేరు పెట్టినప్పుడు దళిత సమాజం మొత్తం స్వాగతించిందని తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు పెడితే అగ్రకుల సమాజం మొత్తం వ్యతిరేకిస్తుందన్నారు. కోనసీమ జిల్లా పేరు అంబేద్కర్ జిల్లాగా కొనసాగించకపోతే హైదరాబాదులో గల అగ్రకులాల కుల భవనాలకు నిప్పు పెడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో తెలంగాణ మాదిగ మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు గజ్జల మల్లికార్జున్, మాదిగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ కోడారి దీరన్, కమ్మేట భూపాల్, కమ్మెట రామస్వామి, బురికి రాములు, జెస్సీ, బోరెల్లి సురేష్, దేవరకొండ నరేష్, ప్రదీప్ వికాస్, జలగం చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.