Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టణ ప్రగతితో నగర దశ మారిపోవాలి
- కౌన్సిల్ సమావేశంలో మేయర్ సామల బుచ్చిరెడ్డి
నవతెలంగాణ-బోడుప్పల్
బోడుప్పల్ కార్పొరేషన్ ప్రజలందరి సహకారంతో స్వచ్ఛ బోడుప్పల్గా తీర్చిదిద్దడానికి కషి చేస్తామని కార్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డి అన్నారు. బుధవారం మేయర్ బుచ్చిరెడ్డి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరంలో వచ్చే నెల 3 నుండి 18 వరకు 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తు న్నామని తెలిపారు. పట్టణ ప్రగతిలో భాగంగా అన్ని డివిజన్లలో సమస్యలు పరిష్కారం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. అనంతరం 6 అంశాలతో కూడిన ఎజెండాకు కౌన్సిల్ అమోదం తెలిపిందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ కె.పద్మజారాణి, డిప్యూటీ మేయర్ కొత్తలక్మ్షీగౌడ్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.