Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్
మేడ్చల్‌లోని రాష్ట్ర సామాన్య ప్రజా పార్టీ ప్రధాన కార్యాల యంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జాకట శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మీర్అలీ తెలంగాణ రాష్ట్ర కోఆర్డి నేటర్‌గా జాకట శ్రీకాంత్‌ని నియమించి అతనికి నియామకపత్రాన్ని అందజేశారు. అనంతరం జాకట శ్రీనివాస్ మాట్లాడుతూ నూతనంగా నియమితులైన శ్రీకాంత్‌ని అభినందిస్తున్నానని అన్నారు. సామాన్య ప్రజల సంక్షేమం కొరకు క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిందిగా సామాన్య ప్రజలకు అండగా ఉండవలసిందిగా, ఆర్ఎస్పీ పార్టీ బలోపేతానికి కషి చేయవలసిందిగా సూచించారు. తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ జాకట శ్రీకాంత్ మాట్లాడుతూ తనకు ఈ అవకాశం ఇచ్చిన పార్టీ అధ్యక్షుడు జాకట శ్రీనివాస్‌కి, ప్రధాన కార్యదర్శి మీర్అలీకి, సహకరించిన ప్రేమ్దాస్కి, బాబురాజ్కి హదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఆర్ఎస్పి పార్టీ బలోపేతానికి సామాన్య ప్రజల సంక్షేమానికి తనవంతు కషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్పీి పార్టీ ప్రధాన కార్యదర్శి మీర్అలీ, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ప్రేమ్‌దాస్, మేడ్చల్ మున్సిపాలిటీ అధ్యక్షులు బాబురాజ్, సీనియర్ నాయకులు అశోక్, చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.