Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి
నవతెలంగాణ-సరూర్‌నగర్
ఆర్కె పురం డివిజన్ పరిధి లోని పలు కాలనీలలో మ్యాన్ హోల్స్‌లో పూడికతీత పనుల కార్యక్రమంను కార్పొరేటర్ రాధాధీరజ్‌రెడ్డి పరిశీలిం చారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నాలాలో పూడికతీసిన తరు వాత డ్రైనేజీ లైన్లో మురికి నీరు సాఫీగా ముందుకు సాగుతుంది. అన్ని నాలాలు నిండి సమస్యలు తలెత్తవని, రాబోరు వర్షా కాలంలో సమస్యలు రాకుండా ముందుగా నాలాలు శుభ్రంచేయడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో సైట్ ఇంజినీర్ మాధవి, కాలనీవాసులు పాల్గొన్నారు.