Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్మెట్
పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ, తట్టిఅన్నారంలోని శ్రేయాస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈనెల 23 నుంచి 26వ తేదీ వరకు యోగ శిబిరాలను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.సాయి సత్యనారాయణరెడ్డి నేతత్వంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి ఆధునిక కాలంలో మనిషి ఉరుకులుపరుగుల మధ్య జీవనం కొనసాగిస్తున్నారని, అందుకని ప్రతి ఒక్కరికీి యోగ ధ్యానం (మెడిటేషన్) ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యోగ, ధ్యానం చేయాలని సూచించారు. వారం రోజులుగా నిర్వహిస్తున్న ఈ కేంద్రంలో సుమారుగా 150 మంది పాల్గొన్నారన్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా తప్పకుండా ధ్యానం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ చైర్మెన్ హదరురెడ్డి, మెడిటేషన్ కోఆర్డినేటర్స్ డాక్టర్ బి.శ్రీనివాస్ ఎ.స్వాతి, ఏఓ రాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.