Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర స్థాయి 69వ కబడ్డిి పోటీల బ్రోచర్ ఆవిష్కరణ
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
క్రీడలతోనే యువతీ, యువకులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వస్తుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంత్రి నివాసంలో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి, టీిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు రామిడి రాంరెడ్డిలతో కలసి రాష్ట్రస్థాయి 69వ కబడ్డీ పోటీల బ్రోచర్, టీ షర్ట్‌లను ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి, యువ నాయకులు పి.కార్తీక్రెడ్డిలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. 69వ రాష్ట్ర కబడ్డీ పోటీలకు ఆతిథ్యమిస్తున్న బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ పారిజాత నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేటర్లు, మున్సిపల్ అధ్యక్షులు రాంరెడ్డిలు నిర్వహించటం హర్షణీయమని తెలిపారు. గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారులు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకోవాటానికి ప్రతి ఒక్కరు కషి చేయాలన్నారు.