Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యేకు కూకట్పల్లి కోర్టు లాయర్ల వినతి
నవతెలంగాణ-కూకట్పల్లి
శేరిలింగంపల్లికి చెందిన క్రిమి నల్ కోర్టు రాజేంద్రనగర్‌కు తరలిపోకుండా ప్రభుత్వ పరం గా చర్యలు తీసుకునేలా చూడా లని, శేరిలింగంపల్లికి ప్రత్యేక కోర్టును కేటాయించాలని కూకట్పల్లి ప్రాంతానికి చెందిన లాయర్లు కోరారు. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి వినతిపత్రం అందజేశారు. సివిల్, ఫ్యామిలీ కోర్టులను కూట్పల్లికి లేదా, వాటికి ప్రత్యేక కోర్టును కేటాయించాలని కోరారు. కోర్టు తరలింపుతో ఇక్కడి ప్రజలు ఇబ్బందులకు గురవుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి బార్ అసోసియేషన్‌కు చెందిన లాయర్లు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజేశ్వరరెడ్డి, మాజీ ప్రెసిడెంట్ అఖిలేశ్, శ్రీనివాసరెడ్డి, సీనియర్ లాయర్లు, నవనీతారావు, రంగనాథ్, మహిళా న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.