Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
గత జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేరుస్తున్నామని చిల్కానగర్ కార్పొరేటర్ గీత అన్నారు. ఈఈ నాగేందర్‌తో కలిసి చిల్కానగర్ డివిజన్లోని ముస్లిం కాబ్రస్థాన్లో రూ.39 లక్షలతో నిర్మిస్తున్న ఈదగా పనులను కార్పొరేటర్ పర్యవేక్షించి మాట్లాడారు. జీహెచ్ఎంసీ అధికారులు, చిల్కానగర్ ముస్లిం మైనారిటీ అసోసియేషన్ సభ్యులతో కలిసి ఈదగా షెడ్ పనులను ప్రారంభించిన ట్టు తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు అతి తక్కువ సమయంలోనే ఈదగాకు నిధులు మంజూరు చేయించి నిర్మిస్తున్నామన్నారు. మైనారిటీ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. అడిగిన వెం టనే రూ.39 లక్షల నిధులు కేటాయించినందుకు మేయర్ గద్వాల విజయ లక్ష్మి, ఎమ్మెల్యే సుభాష్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. నాణ్యతా ప్రమాణాలు పాటించి పనులను పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నిఖిల్ రెడ్డి, రాజకుమార్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, కొండల్ రెడ్డి, రామ్ రెడ్డి, అబ్బోభై, జగన్, రామాంజినేలు, బింగి శ్రీనివాస్, నారాయణ రెడ్డి, బాలు, శ్యామ్ మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఇమామ్ సాహిబ్, హనీఫ్, యూసుఫ్, తాహెర్, గౌస్, అల్తాఫ్, ఖాసీం, మహమూద్, మహ్మద్, అలీమ్,, షఫీ, షేక్ మదర్, చాంద్ బాషా, షాబీర్, అబ్దుల్లా, షఫీ, బాబా, ఇస్మాయిల్, షరీఫ్, అక్బర్, యాకుబ్ పాల్గొన్నారు.