Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
ఇంటర్నేషనల్ డే అఫ్ యాక్షన్ ఫర్ ఉమెన్స్ హెల్త్ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ వారు ప్రత్యేక ఉచిత హెల్త్ ప్యాకేజీ (రూ.3 వేల విలువగల పరీక్షలు ఉచితం) పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంజలి, మెడికవర్ ఉమన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్, కన్సల్టెంట్ గైనకాలోజిస్ట్ అండ్ ఒబెస్ట్ట్రీషన్ - డాక్టర్ రాధిక, డాక్టర్ మీనాక్షి, రేడియాలజిస్ట్ డాక్టర్ హేమ లత, సెంటర్ హెడ్ అనిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంజలి మాట్లాడుతూ కోవిడ్‌పై ఉన్న భయంతో వ్యాధినిరోధక శక్తిని పెంచుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారనీ, ఇలాంటి పరిస్థితుల్లో మహిళలు జాగ్రత్తగా ఉండాలనీ, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచిం చారు. అనంతరం ఉచిత హెల్త్ ప్యాకేజీ పోస్టర్‌ను ఆవిష్క రించారు. ఇలాంటి ప్రత్యేక ప్యాకేజీలు మరెన్నో అందించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. డాక్టర్ రాధిక, కన్సల్టెంట్ గైనకాలోజిస్ట్ అండ్ ఒబెస్ట్ట్రీషన్ మాట్లాడుతూ మహిళలు తమ ఆరోగ్యాన్ని చాలా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. తగిన సమయంలో పరీక్షలు చేయించుకో వాలని తద్వారా వివిధ రోగాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసర సమయాల్లో ఆరోగ్యక రమైన అంశాలపై సమన్వయం, వాతావరణంలో వచ్చే మార్పులను అధిగ మించగలరని తెలిపారు. రాబోయే తరాలకు అందమైన జీవితాన్ని గడపడానికి ఆరోగ్యకరమైన, సంతోషకరమైన వాతావరణాన్ని ఇద్దాం అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్య మనీ, ఆరోగ్యవంతమైన సమాజంతోనే అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని తెలియజేసే దిశగా ఈ రోజును మనం జరుపుకుంటున్నాం అన్నారు. సెంటర్ హెడ్ అనిల్ మాట్లాడుతూ ఉచిత హెల్త్ చెక్ ప్యాకేజీ చేయు పరీక్షలు కంప్లీట్ బ్లడ్ షుగర్, హిమోగ్లోబిన్, ఈఎస్అర్, రాండమ్ బ్లడ్ షుగర్, థైరాయిడ్ స్టిములేటింగ్ హార్మోన్, ఈసీజీ, యూఎస్జీ అబ్డోమెన్ పెల్విస్, పాప్ స్మెర్, గైనాకాలోజిస్ట్, జనరల్ ఫీజిషియన్, న్యూట్రిషన్ కన్సల్టేషన్ చేయనున్నట్టు తెలిపారు. ఈ ఆఫర్ ఈ నెల 28వ తేదీ నుంచి జూన్ 4 వరకు మాత్రమే ఉంటుందనీ, ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని రావాలని కోరారు. అపాయింట్మెంట్ కోసం 040- 68334455 నెంబర్‌ను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆపరేషన్స్ హెడ్ సంగీత, ఇతర వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.