Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో కందుకూరి వీరేశలింగం పంతులు, రమాబాయి అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని కమలానగర్ ఆఫీసులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జి యాదగిరి రావు శ్రీమన్నారాయణ, కోమటి రవి, వెంకట్, జి శ్రీనివాసులు తదితరులు పాల్గొని మాట్లాడారు. వీరేశలింగం పంతులు సంఘసంస్కర్త నవయుగ వైతాళి కుడు బాల బాలికలకు సహా విద్య నేర్పడంలో ఆయన చేసిన కృషి అమోఘ అన్నారు. ఆనాడు సమాజంలో ఉన్న వ్యవస్థను వ్యతిరేకిస్తూ కార్యక్రమాలను నిర్వహించారు. బాల్య వివాహాలను వ్యతిరేకించారు. వితంతు వివాహాలను ప్రోత్సహించారు. బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. మొట్టమొదటిసారిగా యువజన సంఘాలను స్థాపించి నడిపినది ఆయనే అన్నారు. ఈనాడు బీజేపీ ప్రభుత్వం అనువాద సిద్ధాంతాన్ని మరల ప్రజల మీద రుద్దాలని ప్రయత్నం చేస్తూ హిందూ మతోన్మాదంని రెచ్చగొట్టి ప్రజల్లోకి తీసుకు రావాలనే ప్రయత్నం చేస్తున్నదనీ, ఆనాటి కందుకూరి వీరేశలింగం పంతులుని ఆదర్శంగా తీసుకుని మనం పని చేయాలని సూచించారు.