Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట్
సికింద్రాబాద్‌లో శుక్రవారం ఆర్ఎక్స్100 ఫేం పాయల్ రాజ్ పుత్ లే గ్రాండ్ ఇండియా స్టూడియోను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె స్టూడియోలో తిరుగుతూ సందడి చేశారు. ఎలక్ట్రికల్ డిజిటల్ రంగంలో అధునాతన మౌలిక సదుపాయాలతో కూడిన తమ మొట్టమొదటి అవుట్ లెట్‌ను ప్రారంభించినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, స్విచ్ బోర్డులు, లైటింగ్, నూతన సాంకేతిక పరిజ్ఞా నంతో కూడిన ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్టు తెలిపారు. వినియోగదారుల ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకుని ఇంజినీరింగ్ సాంకేతికతను జోడించి వాటిని తయారు చేసినట్టు తెలిపారు. పాయల్ రాజ్ పుత్ మాట్లాడుతూ స్టూడియోను ప్రారంభించడం సంతోషంగా ఉందనీ, స్టూడియోలో వస్తువులు తనకు ఎంతగానో నచ్చాయ న్నారు. టెక్నాలజీతో కూడిన ఎలక్ట్రానిక్ వస్తువులను వినియోగదారులు కొనుగోలు చేయాలని సూచించారు.