Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్
- జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద డీసీఎం డ్రైవర్ల ధర్నా
నవతెలంగాణ-సిటీబ్యూరో
బహదూర్‌పురా ఫ్లై ఓవర్ కిందవున్న డీసీఎం డ్రైవర్లకు ప్రత్యామ్నాయ పార్కింగ్ స్థలం చూపకుండా ఖాళీచేయించవద్దని ఏఐఆర్‌టీడబ్ల్యుఎఫ్ (సీిఐటీయూ) రాష్ట్ర కార్యదర్శి పి.శ్రీకాంత్, సీఐటీయూ సౌత్కమిటీ కార్యదర్శి పి.నాగేశ్వర్, ఏఐఆర్‌టీడబ్ల్యుఎఫ్ (సీిఐటీయూ) నగర కార్యదర్శి కె.అజరుబాబులు హెచ్చరించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద సీిఐటీయూ ఆధ్వర్యంలో 'బహదూర్‌పురా ఫ్లై ఓవర్ కిందవున్న డీసీఎం స్టాండ్‌ని యథాతథంగా కొనసాగించాలనే డిమాండ్‌తో శుక్రవారం డీసీఎం డ్రైవర్స్ ధర్నా చేశారు. ఈ ధర్నాలో వారు మాట్లాడుతూ.. '1988 నుండి జూపార్కు రోడ్ సైడ్‌లో పార్కింగ్ స్టాండ్‌లో ప్రశాంతంగా వుండేవారిని రోడ్డు వేస్తున్నామని, ప్రత్యామ్నాయంగా బహదూర్‌పురా ఫ్లై ఓవర్ కింద పార్కింగ్ ప్లేసు ఇస్తున్నామని చెప్పిన అధికారులు ఇప్పుడు ఇక్కడ మొక్కలు నాటాలని, కేటీఆర్ ఒత్తిడి చేస్తున్నారనే పేరుతో ఖాళీచేయాలని డ్రైవర్లపై దౌర్జన్యానికి దిగుతున్నారని చెప్పారు. ఇది సరైన పద్ధతికాదని, '' కేటీఆర్ ఆఫీసు ఛాంబర్ లేకుండా మినిస్ట్రీ బాధ్యతలు చూడాలంటే చూడగలరా? జీహెచ్ఎంసీ కమిషనర్‌కు ఛాంబర్ లేకుండా విధులు నిర్వహించమంటే నిర్వహించగలరా? వారికి ప్రత్యామ్నాయం చూపకుండా వెళ్ళమంటే ఎక్కడికెళ్తారు. మొక్కలు నాటేందుకు మేము వ్యతిరేకంకాదు. పార్కింగ్ ప్లేసు చుట్టూ గోడల వద్ద మొక్కలు నాటి దాని రక్షణ బాధ్యత డ్రైవర్లే చూస్తారు. ఆ విధంగా అధికారులు ఆలోచన చేయాలి'' అన్నారు. బలవంతంగా అక్కడినుంచి తరలించాలని ప్రయత్నిస్తే సహించేదిలేదు' అని హెచ్చరించారు. ధర్నా అనంతరం చీఫ్ ఇంజనీర్ దేవానంద్‌కు మెమోరాండం అందజేశారు. కార్యక్రమానికి జనతా మీడియం గూడ్స్ అండ్ లారీ డ్రైవర్స్ యూనిన్ అధ్యక్షులు అబ్దుల్ రహీమ్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షులు మహమ్మద్ ఇషాక్, జనరల్ సెక్రెటరీ షేక్‌ఫరీద్, జాయింట్ సెక్రెటరీ అబ్దుల్‌ఖాన్, ట్రెజరర్ మహ్మద్ మొహియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.