Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సరూర్‌నగర్
ఇండిస్టియల్ టూర్ వల్ల విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని శివాని మహిళా కళాశాలల ఛైర్మన్ డా.పి.రాంరెడ్డి అన్నారు. శుక్రవారం ఆర్‌కెపురంలోని శివాని మహిళా కళాశాల డిగ్రీ విద్యార్థులను జిందా తిలిస్మాత్, ఫరూకి టూత్ పౌడర్, మస్కటి డైరీ అండ్ ఫుడ్ ప్రొడక్ట్స్, పార్లే జి బిస్కెట్ కంపెనీ లకు ఇండిస్టియల్ టూర్‌గా తీసుకెళ్లారు. ఈ సంద ర్భంగా రాంరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను ఇలా ప్రత్యక్షంగా ఇండిస్టీలకు తీసుకెళ్లడం వల్ల ఆ కంపెనీలు నిర్వహించే ప్రొడక్షన్, మేకింగ్, ప్యాకింగ్, ప్లాంట్ వివరాలు తెలుస్తాయన్నారు. తద్వారా భవిష్యత్‌లో ఎవరైనా విద్యా ర్థులు చిన్న తరహా పరిశ్రమలు, సొంతంగా కంపెనీ ఏర్పాటు చేసుకుంటే మెళకువలను నేర్చుకోవొచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రెటరీ వేదిరే సుదర్శన్ రెడ్డి, ప్రిన్సిపాల్ అనిత, విద్యార్థులు పాల్గొన్నారు.