Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ బుద్ధ మురళి
నవతెలంగాణ-కల్చరల్
తెలంగాణ సాహిత్యాన్ని జాతీయ స్థాయిలో ప్రాధాన్యత తెచ్చిన సురవరం ప్రతాప రెడ్డి సాహితీవేత్తగా, సంపాదకునిగా రాజకీయ దూరంధరునిగా తెలంగాణ అభిమానిగా పేరు గడించారని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ బుద్ధ మురళి అన్నారు. శ్రీత్యాగరాయ గానసభలోని కళా సుబ్బారావు కళా వేదికపై గానసభ నిర్వహణలో ఎందరో మహానుభావులు శీర్షికన జరుగుతున్న స్మతి కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం సురవరం ప్రతాప రెడ్డి జయంతి సమావేశం నిర్వహించారు. బుద్ధ మురళి పాల్గొని మాట్లాడుతూ గోల్కొండ పత్రిక నిర్వహకుడిగా తెలంగాణ ప్రాంతానికి చెందిన కవుల రచనలను వెలువరించి, తెలంగాణలో సాహిత్యం తక్కువ అన్నవారికి సురవరం సవాలు విసిరారని గుర్తు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా మారుమూల ప్రాంతం నుంచి జాతీయ రాజకీయ నాయకుల సరసన నిలిచే స్థాయికి సురవరం స్వయంకషితో ఎదిగారని వివరించారు. గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి అధ్యక్షత వహించిన వేదికపై కాంగ్రెస్ నాయకులు శ్రీమణి, సెన్సార్ బోర్డు సభ్యుడు అప్పారావు, గీతా దేవి, లతా వర్మ పాల్గొన్నారు.