Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్‌పేట
తాగునీటి సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని జల్పల్లి మున్సిపల్ 27వ వార్డు కౌన్సిలర్, టీఆర్ ఎస్ అధ్యక్షులు ఎక్బాల్ బిన్ ఖలీఫా అన్నారు. శుక్రవారం మున్సిపల్లోని 27వ వార్డులోని వివిధ కాలనీల్లో తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని ట్యాకర్లతో ఇంటింటికీ తాగునీటి సరఫరా చేశారు. మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అదేశంతో మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ సహకారంతో వార్డులోని తుర్ కాలనీ వాసులకు తాగునీటి సమస్య లేకుండా మిషన్ భగీరథ పథకం ద్వారా పైపు లైన్ నిర్మాణ పనులను పూర్తి చేస్తామని తెలిపారు.