Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
అంబేద్కర్ కళాశాలలో బీఏ విద్యార్థులు శుక్రవారం మాక్ అసెంబ్లీని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులే గవర్నర్, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. విద్యార్థులకు మాక్ అసెంబ్లీ ప్రభుత్వంపై అవగాహన పెంచడానికి ఎంతో ఉపయోగపడింది. యువత సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి మాక్ అసెంబ్లీ నాయకత్వ లక్షణాలను అందించిందని అనేక మంది విద్యార్థులు పేర్కొన్నారు. శాసనసభలో ఎమ్మెల్యేలు ఎంతో చురుగ్గా ప్రశ్నలు వేశారు. ప్రభుత్వంగా వ్యవహరించిన మరొక పార్టీ చాలెంజ్‌గా తీసుకుని సమాధానం ఇచ్చింది. అణగారిన వర్గాలు, నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని తమ ప్రశ్నల ద్వారా ప్రభుత్వాన్ని నిలదీశారు. దాదాపు 20 మంది విద్యార్థులు ప్రశ్నలు వేశారు. ఈ మాక్ అసెంబ్లీ ముగింపు సమావేశానికి మాజీ మంత్రి, అంబేద్కర్ కళాశాల సెక్రెటరీ గడ్డం వినోద్ విద్యార్థులను ఉద్దేశించి నాయకత్వ లక్షణాలు, బాడీ లాంగ్వేజ్ పై సూచనలు ఇచ్చారు. మాక్ అసెంబ్లీ సమావేశాన్ని అంబేద్కర్ కళాశాల డైరెక్టర్ మోహన్ రావు ప్రిన్సిపాల్ వేదాంతం రవి ప్రారంభించారు. అరబిందో సొసైటీ వారు జ్యురీగా ఉండి ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఐదుగురు విద్యార్థులకు అవార్డులను ప్రకటించారు. అరుణ్ నాయక్, రాజేశ్వరి, మస్తాన్, కీర్తన, తెలంగాణ సంపత్ కు అవార్డులను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో 80 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేయడంలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ వెంకటేశ్వర్, డాక్టర్ విజయేందర్, డాక్టర్ మధుకర్, డాక్టర్ సుమలత, బండ్ల శ్రీధర్, కృష్ణ కుమార్, నవ్య, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.