Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
కైత్లాపూర్ ఫ్లై ఓవర్‌తో కూకట్పల్లి నియోజకవర్గం రూపురేఖలు మారనున్నాయని ఎమ్మెల్యే మాధవరం కృషా ్ణరావు అన్నారు. శుక్రవారం ఫ్లై ఓవర్ వద్ద జరుగుతున్న పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జూన్ రెండో వారంలో ఈ ఫ్లై ఓవర్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. బోయిన్పల్లి, బాలాన గర్, ఎర్రగడ్డ, మూసాపేట వాసులకు హైటెక్‌సిటీ వెళ్లేం దుకు ఇది ఎంతో అనుకూలంగా ఉంటుందన్నారు. మియాపూర్ నుంచి వచ్చే వాహనదారులకు ట్రాఫిక్ ఒత్తిడి తగ్గి జేఎన్టీయూ వైపు నుంచి సులభంగా హైటెక్ సిటీ ప్రాంతం వైపు చేరవచ్చని తెలిపారు. త్వరలోనే మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా బీజేపీ నాయకులు మత విద్వేషాలు రెచ్చగొట్టడం మాని అభివృద్ధి గురించి మాట్లా డితే బాగుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పగుడాల శిరీషా బాబురావు, సబీయా గౌసోద్దీన్, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.