Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కష్ణ మాదిగ
- రేపు మేడ్చల్ నుంచి మాదిగల సంగ్రామ యాత్ర ప్రారంభం
నవతెలంగాణ-ఓయూ
బీజేపీపైనే మాదిగల యుద్ధం అని ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ అన్నారు. శుక్రవారం పార్సిగుట్టలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక్క పైసా భారం పడని, ఎస్సీ వర్గీకరణను పరిష్కారం చేయలేని బీజేపీ నేతలు లక్షల కోట్లు పెట్టి తెలంగాణను అభివద్ధి చేస్తారా అని ప్రశ్నించారు. 'ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా తెలంగాణకు వచ్చి వర్గీకరణ గురించి ఎందుకు మాట్లాడలేదు. వర్గీకరణపై ఆచరణ లేనప్పుడు బీజేపీ మేనిఫెస్టోలో ఎందుకు చేర్చుకున్నారు? బహిరంగ సభల్లో ఎందుకు మద్దతుగా మాటలు చెప్పారు? వివాదాస్పద బిల్లులను ఎన్నో పార్లమెంట్లో ఆమోదింపజేసుకున్న బీజేపీ వర్గీకరణ బిల్లు పెట్టకపోవడం దారుణం' అని మండిపడ్డారు. ఇక మాదిగల యుద్ధం కేంద్రంలోని బీజేపీ మీదనే, ఈనెల 29న మేడ్చల్ నుంచి నాలుగు నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్ మాదిగ నేతత్వంలో మాదిగ సంగ్రామ యాత్ర కొనసాగుతుందన్నారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్ మాదిగ, ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు సీహెచ్ సోమశేఖర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి బుర్రి సతీష్ మాదిగ, ఉపాధ్యక్షులు రామరాపు శ్రీనివాస్ మాదిగ, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు బుషిపక గణేష్ మాదిగ, ఎంఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు తోకల చిరంజీవి మాదిగ, కార్యదర్శి బిక్కి మురళీకష్ణ మాదిగ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి కరుణాకర్ మాదిగ, బాలు యాదవ్, గోనె సాయిలు మాదిగ, వెల్మల దశరథ్ మాదిగ పాల్గొన్నారు.